Saturday, 24 March 2018

శ్రీరామ నవమి న Mahesh babu భారత్ అనే నేను మొదటి పాట || 108TV Telugu New...

లాలూకు 14ఏళ్ళ జైలు శిక్ష || 108TV Telugu News channel ||

వేలానికి అమ్మాయిలు || 108TV Telugu News channel ||

108TV PROMO || TV Telugu News channel ||

పడగ విప్పిన పాత కక్ష - యువకుడి దారుణ హత్య || 108TV Telugu News channel ||

108TV PROMO 4 || 108TV Telugu News channel ||



20 బంతుల్లో 102 పరుగులు చేసిన వృద్ధిమాన్‌ సాహా

  • జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్‌ సాహా
  • 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్‌లు, నాలుగు పోర్ల సాయంతో 102 పరుగులు
  • ఒక్క వికెట్‌ కోల్పోకుండా ఘన విజయం
జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్‌ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో ఏకంగా 14 సిక్స్‌లు, నాలుగు పోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. ఈ రోజు ఆ ట్రోఫీలో భాగంగా మోహున్‌ బగన్‌-బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వేస్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. మోహున్‌ బగన్‌ జట్టుకు సాహా ప్రాతినిథ్యం వహిస్తోన్న సాహా ఇలా అదరగొట్టేసి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నాడు.

బెంగాల్‌ నాగ్‌పూర్‌ రైల్వేస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో 151 పరుగులు చేయగా, ఛేజింగ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సాహా ఇలా బ్యాటు ఝుళిపించడంతో ఒక్క వికెట్‌ కూడా నష్టపోకుండా ఏడు ఓవర్లలోనే మోహున్‌ బగన్ జట్టు గెలుపొందింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ అమన్‌ ప్రొసాద్‌ వేసిన ఏడవ ఓవర్‌లో సాహా 37 పరుగులు చేయడం మరో విశేషం. సాహా చెలరేగడానికి తోడు అదే జట్టులో ఓపెనర్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ అమన్‌ కూడా 22 బంతుల్లో 43 పరుగులు చేయడంతో సాహా టీమ్ ఘన విజయం సాధించింది.